పత్తి పంటలో కలుపు సమస్య నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు అన్నారు గార్ల మండల పరిధిలోని శేరిపురం గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారులతో కలిసి పత్తి పంట క్షేత్ర సందర్శన చేపట్టి రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పత్తి పంటలో యాజమాన్య పద్ధతులు పాటించాలని కలుపు సమస్యను నివారించడానికి హిట్ విడ్ మాక్స్ అనే కలుపు మందును ఒక ఎకరాకు 500 మిల్లి లేదా టర్గా సూపర్ 400 మిల్లి హిట్ వీడ్ 250 మిల్లీలీటర్లు మిశ్రమాన్ని పత్తిలో సరైన తేమ ఉన్నప్పుడే పిచికారి చేయాలని కలుపు మందును పిచికారి చేసిన తరువాత స్ప్రేయర్ ట్యాంకును శుభ్రంగా కడిగిన తర్వాతనే ఇతర మందుల పిచికారి చేయాలని సూచించారు.
రసం పీల్చే పురుగులైన పేను బంక తెల్ల దోమ పచ్చ దోమ వంటి వాటి నివారణకు థయోమిథాక్సామ్ ఎసటామిపైడ్ మందులను తొలిదశలో వినియోగించాలని తెలిపారు. నేరుగా వెదజల్లిన వరి పంటలో 20 రోజుల తర్వాత కలుపు సమస్య అధికంగా ఉంటుందని కలుపును నివారించినప్పుడే పంట ఏపుగా ఎదిగి ఎక్కువ సంఖ్యలో పిలకలు వస్తాయని కలుపు నివారణకు కౌన్సిల్ యాక్టివ్ అనే మందు 90 గ్రాములు ఒక ఎకరానికి వివాయ 900 మిల్లీలీటర్లు లేదా 100 గ్రాములు నామిని గోల్డ్ ప్లస్ 8 జీఎల్ ఆల్ మిక్స్ పిచికారి చేయాలని సూచించారు. వ్యవసాయ సూచనల కొరకు మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని కోరారు. ఈ క్షేత్ర సందర్శనలో విస్తరణ అధికారి ప్రశాంత్ రైతులు తదితరులు ఉన్నారు.