Monday, November 25, 2024
HomeతెలంగాణKarimnagar: ప్రభుత్వ స్థలంలోని ఇంటి నెంబర్లను రద్దు చేసిన మున్సిపల్ అధికారులు

Karimnagar: ప్రభుత్వ స్థలంలోని ఇంటి నెంబర్లను రద్దు చేసిన మున్సిపల్ అధికారులు

హర్షం వ్యక్తం చేస్తున్న రేకుర్తి గ్రామ ప్రజలు

కరీంనగర్ నగర పాలక సంస్థ 18వ డివిజన్ రేకుర్తిలోని సర్వేనెంబర్ 55, 16 నద్దినాల ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణాలకు అనుమతిస్తూ కేటాయించిన ఇంటి నెంబర్లను ఇటీవల కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటి కమీషనర్ జి.స్వరూప రాణి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేకుర్తి 2018 సంవత్సరం వరకు గ్రామపంచాయతీగా ఉండగా అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కరీంనగర్ నగరపాలక సంస్థలలో విలీనమైంది. ఆ సమయంలో కొంతమంది ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని ఆలోచనతో అక్రమ ఇంటి నెంబర్లను పొందారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు స్థలాలు కేటాయించనప్పటికీ అక్రమంగా ప్రభుత్వ స్థలంలో రేకుల షెడ్లు నిర్మాణాలు చేసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న పరిచయాలతో ఇంటి నెంబర్లను సైతం పొందారు. గత కొంత కాలం క్రితం రేకుర్తికి చెందిన కొంతమంది కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములను కాపాడాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తపల్లి తహసిల్దార్ అక్రమ ఇంటి నెంబర్లను రద్దు పరచాలంటూ నగర పాలక సంస్థ కమీషనర్ కు లేఖ సంఖ్య లేఖ నెం. 8/942/2022, తేది 03-01-2023, ద్వారా కోరగా స్పందించిన డిప్యూటీ కమిషనర్ లేఖ సంఖ్య 21/58/2023-24 2006-07-2024 ద్వారా సర్వే నెంబర్ 16 రేకుర్తి నద్దినాల ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్డు నిర్మాణం చేసుకొని ఇంటి నిర్మాణం పొందిన ఇంటి నెంటర్ 1-15-760 తో పాటు మరికొన్ని ఇంటి నెంబర్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -


మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే మరిన్ని అక్రమ ఇంటి నెంబర్లు వెలుగు చూసే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News