Tuesday, September 17, 2024
HomeతెలంగాణCM Revanth meeting with central Jal Sakthi minister:

CM Revanth meeting with central Jal Sakthi minister:

  • జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు సీఎం రేవంత్. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోంద‌ని, దానిని శుద్ది చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సంక‌ల్పించింద‌ని కేంద్ర మంత్రికి తెలిపిన ముఖ్య‌మంత్రి.
  • జాతీయ న‌ది ప‌రిర‌క్ష‌ణ ప్ర‌ణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి ప‌నులకు రూ.4 వేల కోట్లు, గోదావ‌రి న‌ది జ‌లాల‌ను ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయ‌త్ సాగ‌ర్‌ల‌తో నింపే ప‌నుల‌కు రూ.6 వేల కోట్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రి సి.ఆర్‌. పాటిల్‌ను కోరిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
  • ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయ‌త్ సాగ‌ర్‌ను గోదావ‌రి నీటితో నింపితే హైద‌రాబాద్ నీటి ఇబ్బందులు ఉండ‌వ‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
  • 2019లో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప్రారంభ‌మైనా ఈ ప‌థ‌కం కింద ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌కు నిధులు ఇవ్వ‌లేద‌న్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.
  • తెలంగాణ‌లో 7.85 ల‌క్ష‌ల ఇళ్ల‌కు న‌ల్లా క‌నెక్ష‌న్ లేద‌ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ముఖ్య‌మంత్రి. న‌ల్లా లేని 7.85 ల‌క్ష‌ల‌ ఇళ్ల‌తో పాటు పీఎంఏవై (అర్బ‌న్‌), (రూర‌ల్‌) కింద చేప‌ట్టే ఇళ్ల‌కు న‌ల్లా క‌నెక్ష‌న్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని తెలిపిన ముఖ్య‌మంత్రి. ఈ ఏడాది నుంచి జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ నిధులు తెలంగాణ‌కు కేటాయించాల‌ని కోరిన ముఖ్య‌మంత్రి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News