రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో గంజాయి అమ్మడానికి వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇల్లంతకుంట పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్ తో కలిసి సీఐ మొగిలి నిందితుల వివరాలు వెల్లడించారు. ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామనికి చెందిన చింతలపల్లి నాగిరెడ్డి అనే వ్యక్తి, కరీంనగర్ లో ఒక వాటర్ ప్లాంట్ లో పని చేస్తూ, కరీంనగర్ కి చెందిన గుర్రాల నిఖిల్ రెడ్డి తో పరిచయం ఏర్పడి, ఇద్దరు వ్యక్తులు గంజాయి తాగడానికి అలవాటు పడ్డారు. కరీంనగర్ లో తెలియని వ్యక్తి వద్ద తాగడానికి, అమ్మడానికి గంజాయి కొనుగోలు చేసి ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో అమ్మడానికి వస్తున్నారన్న సమాచారం మేరకు వంతడుపుల గ్రామ శివారులో ఇద్దరు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద నుండి 100 గ్రాముల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ యువత గంజాయికి అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తరచు వారిని గమనిస్తూ ఉండాలన్నారు. ప్రజలు ఎవరైనా గంజాయికి సంబంధించిన సమాచారం డయల్ 100 లేదా టాస్క్ఫోర్స్ సి.ఐ ఫోన్ నెంబర్ 87126 56392 కి సమాచారం అందించగలరని తెలిపారు. గంజాయి అక్రమంగా రవాణా చేసిన, విక్రయించిన తగిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్బంగా హెచ్చరించారు.