Thursday, April 10, 2025
HomeNewsBoI's Samjhauta Dinam: మొండి బకాయిల సెటిల్మెంట్ కు సువర్ణావకాశం బ్యాంక్ ఆఫ్ ఇండియా...

BoI’s Samjhauta Dinam: మొండి బకాయిల సెటిల్మెంట్ కు సువర్ణావకాశం బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ‘సంఝౌతా దినం’లో

వన్ టైమ్ సెటిల్మెంట్  కింద పరిష్కరించుకోండి

మొండి బాకాయి ఋణ ఖాతాల పరిష్కారానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా సంఝౌతా దినం నిర్వహిస్తోంది.  సంఝౌతా దినంలో భాగంగా రుణగ్రహీతల నుంచి మొండి బకాయిలను వన్ టైమ్ సెటిల్మెంట్  కింద పరిష్కరించుకోవడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా వెసులుబాటు కల్పించింది.  శుక్రవారం బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని శాఖలు లేదా జోన్లలో ఎఫ్.జీ.ఎం.ఓలలో సంఝౌతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  ఏదైనా నిజమైన, బలమైన కారణం వల్ల సకాలంలో రుణాన్ని చెల్లించలేని మొండి బకాయిల రుణగ్రహీతల కోసం ప్రత్యేకం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 

- Advertisement -

చిన్న ఖాతాలు, మిడ్-సైజ్ ఖాతాల పరిష్కారానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓటీఎస్ పథకాలు ఇప్పటికే అనుసరిస్తోంది.  మొండి బకాయిలున్న రుణగ్రహీతలు ప్రత్యేక డిస్కౌంట్లను ఓటీఎస్ కింద తీసుకోవచ్చు.  26-07-2024న పెద్ద ఎత్తున జరిగే సంఝౌతా దినోత్సవం నాడు  రుణాల ఖాతాలను సెటిల్ చేసుకోవడానికి సువర్ణ అవకాశమని బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బకాయి ఖాతాలున్న రుణగ్రహీతలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News