ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ మాట్లాడుతూ … జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యం అని జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ అన్నారు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు సమావేశంలో ఎస్పి మాట్లాడుతూ… జిల్లా పరిధిలోని సామ్యాసుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని , విద్వేషాలను రెచ్చగోట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము అన్నారు. అలాగే జిల్లా పోలీసు సిబ్బందితో క్విక్ రియాక్షన్ టీమ్స్ (3) QRT (Quick Reaction Teams) ఏర్పాటు చేసి జిల్లాలో శాంతి , సౌమ్యం ,పారదర్శక నిర్వహణకు ఈ క్విక్ రియాక్షన్ టీమ్స్ (3) QRT (Quick Reaction Teams) ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
జిల్లాలో నేరాల నియంత్రణ, అదుపునకు మరియు నేరాల గుర్తింపు శాంతి భద్రతల (LAW & ORDER) సంరక్షణకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం అని ఇందుకు అనుగుణంగా జిల్లాలో 3 QRT లు కేటాయించామని, జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ ఒక ప్రకటనలో తెలియజేసారు. ఇందులో బాగంగా (QRT) బలగాలను విస్తృతంగా వినియోగించి లా&ఆర్డర్ నిర్వహించడంలో, ఏదైనా నిరసనలకు వెంటనే స్పందించడంలో, ఈ కీలక సమయంలో పౌరుల భద్రతను నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు.
క్విక్ రియాక్షన్ టీమ్స్ ఉద్దేశ్యం, విధులు
జిల్లాలో ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు సంభవిస్తే వెంటనే స్పందించేందుకు QRT బలగ బృందాలు వ్యూహాత్మకంగా నివారించడానికి కేటాయించబడ్డాయి వేగవంతమైన స్పందన ఏదైనా నిరసన లేదా లా అండ్ ఆర్డర్ పరిస్థితిలో తక్షణ సహాయం అందించడం.. నిరంతర పర్యవేక్షణ , జిల్లా అంతటా శాంతిని కొనసాగించడం. నిరోధకత: బలమైన పోలీస్ ఉనికితో ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనకుండా నిరోధించడానికి QRT ల వినియోగం ఉపయోగించబడుతుంది. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఈ బలగాలు సత్వరమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ శాంతి వాతావరణం నెలకొల్పడం.
ప్రజలకు విజ్ఞప్తి
ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712657888 కు తెలుపగలరు. ప్రజలందరూ కలసికట్టుగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం సహకరించాలని కోరినారు.