ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించిన సీఎం. ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్న సీఎం. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించిన సీఎం. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని సూచించిన సీఎం. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామన్న ముఖ్యమంత్రి.
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, సునీల్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులు. ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై చర్చ.