సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 25న ప్రారంభమై వచ్చేనెల 8 వరకు అత్యంత ఘనంగా నిర్వహించాలని నంద్యాల ఆర్డీవో శ్రీనివాసులు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశంలో డిప్యూటీ తాసిల్దార్ రవీంద్ర ప్రసాద్ చంద్రశేఖర్ ఎంపీడీవో సుబ్బారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు, సీఐ రాజశేఖర్ రెడ్డి, అహోబిలం మఠం ప్రతినిధి సంపత్ సెబ్ సీఐ నాగమణి చంద్రమణి ఎస్ఐ నరసింహులు ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొదటి సారిగా అహోబిలం మఠం ఆధ్వర్యంలో జరగనున్న నేపథ్యంలో అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు.
అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో ఎగువ, దిగువలో జరిగే బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఎక్కడ రాజీ పడకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. మఠం ప్రతినిధి సంపత్ మాట్లాడుతూ అహోబిలం 46 పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శఠగోపయతీంద్ర మహదేశికన్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. అహోబిలంలో నూతనంగా ఏపీ టూరిస్ట్ పోలీస్ స్టేషను కూడా అందుబాటులోకి రావటంతో భక్తులకు భద్రతా సమస్యలు రావనే అభిప్రాయ వ్యక్తమైంది.