ఫాగింగ్ లేకపోయే దోమలు పెరిగిపోయే, వ్యాధుల బారిన పడుతున్న చిన్నారులు వృద్ధులు ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు అని తెలుగుప్రభ దిన పత్రికలో వెలువడిన కథనానికి స్పందన లభించింది. స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలో దోమల నియంత్రణకు ఫాగింగ్ చర్యలు చేపట్టారు. దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ సీజనల్ వ్యాధులైన డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలతో మంచం పడుతున్నారు. దోమల స్వైర విహారంతో పగలు రాత్రి తేడా లేకుండా కంటిమీద కునుకు లేకుండా పోతుందని, ఆరు బయట సైతం నిల్చోలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా దోమల నియంత్రణ చర్యలు చేపట్టే విధంగా కృషిచేసిన తెలుగుప్రభ దినపత్రిక రిపోర్టర్ యాజమాన్యానికి ప్రజలు అభినందనలు తెలిపారు.