Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిపిన మీడియా సంఘాలు

Hyd: కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిపిన మీడియా సంఘాలు

యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలంగాణ టివి, డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు మంత్రి తలసాని హాజరయ్యారు. మీడియా వారు రూపొందించిన ప్రత్యేక పాటను తలసాని ఆవిష్కరించారు. అనంతరం వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శమని కొనియాడారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వివిధ భాషలకు చెందిన కళాకారులకు అనేక అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు. ఒకప్పుడు చలన చిత్ర పరిశ్రమ అంటే చెన్నై గుర్తొచ్చేది అని, నేడు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ గా మారడం గర్వకారణం అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News