గ్రామ పంచాయతీ లలో వెట్టిచాకిరీ చేస్తూ పంచాయతీల అభివృద్ధి కి తోడ్పాటును అందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల ను పరిష్కరించాలని సిఐటియు మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) అధ్వర్యంలో ఛలో హైదరాబాదు కు ధర్నా నిమిత్తం కార్మికులు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల కు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్, ప్రమాద భీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాదు తరలిన వారిలో యూనియన్ నాయకులు,కార్మికులు పి.దాస్,శ్రీను, జి.కిషన్, వీరాస్వామి తదితరులు ఉన్నారు.