కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కల్వకుంట్ల కవిత.. మోడీ ప్రధాని అయ్యాక 100 లక్షల కోట్ల అప్పు చేసిన కేంద్రం తెలంగాణపై విమర్శలు గుప్పిస్తారా అంటూ కవిత మండిపడ్డారు. కవిత మాట్లాడుతూ..2014 నాటికి రూ.55 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు దాదాపు రూ. 155 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. అప్పుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన దానికి కేంద్ర ప్రభుత్వం చేసిన పొంతనేలేదని అన్నారు. ఈ దేశంలో ఒక్కో వ్యక్తిపై 3 రేట్ల అధిక అప్పును మోడీ మోపారని తెలిపారు. కొత్త రాష్ట్రానికి ప్రత్యేక అవసరాలు ఉంటాయని, కాబట్టి దయచేసి అన్ని రకాలుగా ఆదుకోవాలని సీఎం కేసీఆర్ కోరారని, అయనా కూడా కేంద్రం పట్టించుకోలేదన్నారు కవిత.