Tuesday, November 26, 2024
Homeట్రేడింగ్Medicover free tests: మెడికవర్ లో ప్రతి శనివారం ఫ్రీ గైనిక్ కన్సల్టేషన్

Medicover free tests: మెడికవర్ లో ప్రతి శనివారం ఫ్రీ గైనిక్ కన్సల్టేషన్

ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్

ప్రతి శనివారం ఉచిత గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉచితంగా చేపడుతున్నట్టు మెడికవర్ ఆసుపత్రి ప్రకటించింది. ఈమేరకు కార్పొరేట్ వర్కింగ్ ఉమన్, వారి కుటుంబ సభ్యులకు షీ క్లీనిక్స్- (ప్రతి శనివారం ఉచిత గైనకాలజిస్ట్ కన్సల్టేషన్, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్, 30% డిస్కౌంట్ ఆన్ అల్ ఇన్వెస్టిగేషన్స్, కాంప్లిమెంటరీ హెల్త్ చెక్ ప్యాకేజీ (సంవత్సరానికి ఒకసారి) ) ప్రారంభించింది మెడికవర్ ఉమన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్.

- Advertisement -

షి క్లినిక్స్ ప్రారంభం..

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుల్నార్ విర్క్ కృష్ణ – హ్యాష్‌ట్యాగ్ మార్కెటింగ్ వ్యవస్థాపకురాలు, ఇషా సిన్హా -చీఫ్ లీగల్ అండ్ కంప్లయన్స్ ఆఫీసర్ పాల్గొని షి క్లీనిక్స్ ను ప్రారంభించారు.

అనంతరం ముఖ్య అతిథులుగా గుల్నార్ విర్క్ కృష్ణ మాట్లాడుతూ..ఒత్తిడి, సరైన లైఫ్‌స్టైల్ లేని కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని వివరించారు. వయస్సు, శారీరక వ్యాధులు, సమస్యలు మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. దినచర్యలో ఆరోగ్యకరమైన మార్పులు చేయడం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వ్యాయామం చేయడం ద్వారా ఈ అనారోగ్య లక్షణాలను కొంతవరకు తగ్గించవచ్చని ఆయన సూచించారు.

వ్యాయామం జీవితంలో భాగం చేసుకోవాలి..

మహిళలు వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండాలనుకోవడం కూడా హక్కే అని ఆయన గుర్తుచేయటం విశేషం. ఇక ఈ సందర్భంగా పలువురు డాక్టర్స్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యం విషయంలో ప్రతీ దశలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా అన్ని వయస్సుల వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.

ఫ్రీ చెకప్స్ ఆఫర్ పొందటానికి వచ్చే వారంతా తమతమ కంపెనీ ఐడీ కార్డులు తీసుకొనిరాగలరని మెడికవర్ ఆసుపత్రి తెలిపింది. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ అఫ్ బిసినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్ , డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే ,సెంటర్ హెడ్ కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News