Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైల జలాశయానికి భారీగా వరద 10 గేట్లు 20 అడుగుల మేరకు ఎత్తివేత...

Srisailam: శ్రీశైల జలాశయానికి భారీగా వరద 10 గేట్లు 20 అడుగుల మేరకు ఎత్తివేత దిగువ నాగార్జునసాగర్ కు నీరు విడుదల

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుండటంతో 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి 4, లక్షల 62,వేల 200 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు నాగార్జున సాగర్ కు విడుదల చేశారు ..ఎగువ ప్రాజెక్టుల నుంచి 4, లక్షల 31 వేల,396 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు లోకి వచ్చి చేరుతున్నడంతో నీటినిల్వా 882:60 అడుగులకు చేరుకుంది.

- Advertisement -

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు..ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ సామర్థ్యం 202,5056 టిఎంసి ల నీరు ఎడబాటులో ఉంది..పూర్తి స్థాయి సామర్థ్యం 215.8070 టీఎంసీ లు.. ఎగువ నుంచి భారీగా వస్తున్న నీటిని దృష్టిలో ఉంచుకొని 10 గేట్ల ద్వారా , లక్షల 4, వేల,62,200 నీటిని సాగర్ జలాశయానికి నీటిని వదిలారు.. కుడి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ,62,668 వేల క్యూసెక్కుల నీరు వదిలివేశారు. గత ఏడాది పోల్చితే ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు జూలై నెలలో పూర్తి స్థాయికి చేరుకోవడం, నీటిని దిగువకు వదిలివేయటం విశేషం.

డ్యామ్ గేట్లు ఎత్తడంతో సందర్శకుల కోలాహలం నెలకొంది. శ్రీశైల జలాశయాన్ని చూసేందుకు సందర్శకులు వాహనాలు రోడ్ల పక్కనే నిలిపివేయడంతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే భక్తులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అధికారులు చొరవచూపి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలని సందర్శకులు, భక్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News