Thursday, September 19, 2024
HomeతెలంగాణSerilingampalli: కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి నాయకులు

Serilingampalli: కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి నాయకులు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నేతృత్వంలో బిజెపి సీనియర్ నాయకుడు లక్ష్మణ్ తో పాటు మరి కొంతమంది బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

హఫీస్ పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ యూత్ కాలనీలలో గత 20 సంవత్సరాలుగా బిజెపి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుడు లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు అరికపూడి గాంధీ మాట్లాడుతూ దేశంలోని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. శేరిలింగంపల్లి పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద సంఖ్యలో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సమచిత స్థానం కల్పిస్తామని గాంధీ చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని ఆయన ఈ సందర్భంగా కొత్తగా చేరిన బిజెపి నాయకులను సూచించారు. ఒక వారధిగా పని చేయాలని ఎమ్మెల్యే గాంధీ కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎంతగానో అభివృద్ధి చేశామని గాంధీ వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని, మంచి పనులు ఎన్నో చేశామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తలే పార్టీకి శ్రీరామరక్షని గాంధీ చెప్పారు. నేడు యువత అంతా కాంగ్రెస్ వైపే ఉందని, యువతకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, కంటికి రెప్పలా చూసుకుంటామని గాంధీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌతమ్ గౌడ్, మోహన్, బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి సీనియర్ నాయకుడు లక్ష్మణ్, మన్సూర్ అలీ, సాగర్, లక్ష్మణ్, కిరణ్, వెంకట్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, రాహుద్దీన్, శంకర్ పూజారి, విశ్వనాథ్, దయానంద్, సంజు, సుధాకర్ గౌడ్, విజయ్ కుమార్, రామకృష్ణ, మూతిరామ్, సురేష్, రమేష్, కొండలి గణేష్ ముదిరాజ్, గోరక్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, రాముడు, మరాఠా సంఘం సభ్యులు, మోచ్చి సంఘం సభ్యులు, సగర సంగం సభ్యులు, మైనార్టీ సీనియర్ నాయకులంతా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News