Friday, November 22, 2024
HomeతెలంగాణSerilingampally: చేనేత కళాకారులను ప్రోత్సహించడానికి శిల్పారామం ముందుంటుంది

Serilingampally: చేనేత కళాకారులను ప్రోత్సహించడానికి శిల్పారామం ముందుంటుంది

శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు

మాదాపూర్ లోని శిల్పారామంలో డెవలప్ మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్, మినిస్టరీ ఆఫ్ టెక్స్ టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంయుక్త నిర్వహణలో శిల్పారామంలోని ఎత్నిక్ హాల్ లో జాతీయ చేనేత దినోత్సవ ఉత్సవాలను నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ కుమార్ హాజరయ్యారు. శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు, చేనేత కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్, పద్మశ్రీ గజం అంజయ్య, శివకుమార్, కొండ కవితా రెడ్డి, క్యురైటర్ విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 20 మంది నేషనల్ అవార్డు గ్రహీతలను చేనేత కళాకారులను సత్కరించారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ వారు నిర్వహించే చేనేత పథకాల గురించి శిల్పారామంలో ఉన్న చేనేత హస్త కళాకారులందరికీ ఆ పథకాలు ఎలా ఉపయోగపడతాయో డైరెక్టర్ అరుణ్ కుమార్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చేనేత కళాకారులను ప్రోత్సహించడానికి శిల్పారామం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News