మెట్ పల్లి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ ఛైర్మన్ రాణవేణి సుజాత సత్య నారాయణ అధ్యక్షతన కేక్ కట్ చేశారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ టీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, స్థానిక బీఆర్ఎస్ నేతలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.