కరీంనగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో గల కొత్తపెల్లి మండలం బావు పేట (ఆసిఫ్ నగర్) గ్రామంలో రోడ్లు ధ్వంసమై వర్షపు నీటితో బురద గుంతలుగా మారాయి. గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇండ్లలో నుండి కనీసం బయట బయట తిరిగేందుకు అవకాశం లేకుండా నీటి గుంతలు గా ఏర్పడిన రోడ్లు బురద మయమైపోయాయి. గ్రామంలోని ప్రజల చిన్న చిన్న వాహనాలు కూడా ఈ రోడ్లపై ప్రమాదాలకు అడ్డగా మారుతుంది.
ఈ రోడ్లు ధ్వంసం కావడానికి ఈ గ్రామంలో గ్రామ పరిసర గ్రామాల్లో గ్రానైట్ రాయి తరలించే తరలించే భారీ లారీలు గ్రానైట్ తీసేందుకు వాడే భారీ వాహనాలు యంత్రాలు ఈ రోడ్లపై తీసుకెళ్లడమే ఈ దుస్థితికి కారణం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం సాగిస్తున్న గ్రానైట్ వ్యాపారం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్న సంస్థలు ఇక్కడి ప్రజల పరిస్థితుల పట్ల ఏమాత్రం కనికరం చూపడం లేదు. భారీ వాహనాలతో రాకపోకలు సాగిస్తున్న రోడ్లు ధ్వంసమై వర్షపు నీరు చేరి బురద గుంతలుగా మారి దోమలకు క్రిమి కీటకాలకు స్థావరాలుగా ఏర్పడుతున్నాయి.
ఈ అపరిశుభ్రత పరిస్థితి వల్ల గ్రామంలోని ప్రజలు అనేక అనారోగ్య పాలు అవుతున్నారు. ఇక్కడ అనేక రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం వచ్చి జీవిస్తున్నారు.కానీ స్థానిక గ్రామ ప్రజలకు మాత్రం సరైన ఉపాధి దొరకడం లేదు.ఏండ్ల తరబడి గ్రానైట్ తవ్వకాలు జరుపుతున్న సరైన లెక్క తేలడం లేదు. గ్రామంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని భయానక వాతావరణంలో ప్రజలు ఉన్నారు.గ్రామంలోని యువత గ్రానైట్ వ్యాపారులు రాజకీయ నేతలు చేతుల్లో కీలుబొమ్మలై అనేక దుర్విసనాలకు బానిసలుగా మారుతున్నారు. ఇక్కడ సామాన్య ప్రజలు ఈ అపరిశుభ్రత వాతావరణాన్ని భరించక తప్పడం లేదు.
ఈ గ్రామం పైన ప్రజాప్రతినిధులు కనీస దృష్టి పెట్టడం లేదని ఈ పరిస్థితులే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టుగా ఇక్కడ సమస్యలను పట్టించుకోవడంలేదని స్పష్టంగా అర్థమవుతుంది. గ్రామ ప్రజలు కూడా గ్రామంలోని ప్రజాప్రతినిధుల పైన సంబంధిత అధికారుల పైన అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కేవలం వ్యాపార కాంక్షతోటే గ్రామాన్ని ధ్వంసం చేస్తున్నారని ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారని విషయాన్ని పూర్తిగా మర్చిపోయారని ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్లే రహదారి బావుపేట శివారు పెద్ద మోరి వద్ద నేటికీ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకపోవడంతో వందల సంఖ్యలో వాహనాలు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతున్న ఆర్ అండ్ బి అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు, చొరవ చూపి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయలేకపోవడంపై అనేక ఆరోపణలు వెల్లువిరుస్తున్నాయి. ఇప్పటికైనా ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారని విషయం గుర్తించాలని స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులను ప్రభుత్వాధికారులను వేడుకుంటున్నారు.