అసలే ఆషాడ మాసం ఆషాడ మాసంలో మంచి ముహూర్తాలు కూడా ఉండవు, అంతేకాదు కొత్త పనులు కూడా కలిసి రావని ప్రజల నమ్మకం. ఏ పని చేయాలన్నా ఆషాడ మాసంలో ఎవరు కూడా పెట్టుకోరు. అదే తరహాలో కొంతమంది నాయకులు, కారు దిగిపోయి, హస్తం వైపు చూస్తున్నట్లు మండలంలో పలువురు ప్రధాన కూడల వద్ద గుసగుసలాడుకుంటున్నారు. మరి ఆ నాయకులకు, కార్యకర్తలకు హస్తం పార్టీ కలసొచ్చేనా..! లేక మొండి చేయి చూపించే నా అని అనుకుంటున్నారు. ఆ నాయకులు, ఇప్పటికే మంత్రి పొన్నంకి టచ్ లో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకేనేమో… ఆషాడ మాసం కలిసి రాదని, శ్రావణమాసంలో హస్తం గూటికి వెళ్దామని మంచి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు మండలంలో పలువురు చర్చించుకుంటున్నారు. ఆ నాయకుల వెంట, మాజీ ప్రజా ప్రతినిధులు కూడా హస్తం గూటికి వెళుతున్నట్టు, పలువురు చర్చించుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్ నియోజకవర్గంలో బి ఆర్ఎస్ పార్టీలో చిగురు మామిడి, మండల ప్రజా ప్రతినిధులకు, మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాడట, మాజీ ఎమ్మెల్యే నమ్ముకున్న నాయకులు వెళితే, తన నమ్ముకున్న వారే తనను వెన్నుపోటు పొడిచిన వారు అవుతారని, పలువురు మండలంలో చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించిన బిఆర్ఎస్ పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరనున్నట్లు సమాచారం. వీరు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల, వీరికి లాభమో, లేక కాంగ్రెస్ పార్టీకి లాభమో ఇక వేచి చూడాల్సిందే.