Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ఆస్పిరేషనల్ బ్లాక్ సూచికలో పురోగతి సాధించాలి

Kurnool: ఆస్పిరేషనల్ బ్లాక్ సూచికలో పురోగతి సాధించాలి

నీతి అయోగ్ సిఈఓ బివిఆర్.సుబ్రమణ్యం

ఆస్పిరేషనల్ బ్లాకులకు సంబంధించిన సూచికలో సెప్టెంబర్ 30వ తేదిలోపు పురోగతి సాధించాలని కోరుతూ గురువారం ఢిల్లీ నీతి అయోగ్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల జిల్లా కలెక్టర్లతో ఆస్పిరేషనల్ బ్లాక్ కు సంబంధించిన వివిధ అంశాలపై నీతి అయోగ్ సిఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నీతి అయోగ్ సిఈఓ మాట్లాడుతూ భారతదేశంలోని వెనుకబడిన మండలాలను అభివృద్ధి చేయడం కోసం 500 మండలాలను ఎంపిక చేసినట్టు, వీటిని అభివృద్ధి చెయ్యడం కోసం ఆస్పిరేషనల్ బ్లాక్స్ అనే కార్యక్రమం నీతి అయాగ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.

- Advertisement -

ఈ మండలాల్లో అభివృద్ధి చేయడం కోసం 39 ఇండికేటర్స్ ను ప్రవేశపెట్టి వంద శాతం పురోగతి సాధించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని కలెక్టర్ వివరించారు. అందుకు 39 ఇండికేటర్స్ లో మొదటిగా 6 ఇండికేటర్స్ ఎంపిక చేసి సంపూర్ణత అభియాన్ అనే కార్యక్రమం ద్వారా 3 నెలలలోపు ఉన్న గర్భిణీ స్త్రీలను గుర్తించి వారిని రిజిస్ట్రేషన్ చేయాలని, డయాబిటీస్, హైపర్టెన్షన్ ను పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ చేయాలన్నారు. ఐసిడిఎస్ కు గర్భిణీ స్త్రీలకు సంబంధించి వంద శాతం టేక్ హోం రేషన్ అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో సాయిల్ హెల్త్ కార్డ్స్ అందజేయాలన్నారు. డిఆర్డిఎకు సంబంధించి ఉన్న గ్రూపులకు సంబంధించి అర్హులైన వారికి రివాల్వింగ్ ఫండ్స్ అందజేయాలన్నారు. ఈ ఇండికేటర్స్ కు సంబంధించి సెప్టెంబర్ 30వ తేదిలోపు పురోగతి సాధించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, సిపిఓ హిమప్రభాకర్ రాజు, ఇంఛార్జి డిఎంహెచ్ఓ భాస్కర్, ఇంఛార్జి ఐసిడిఎస్ పిడి వెంకటలక్ష్మి, డిఆర్డిఎ పిడి సలీం బాషా, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News