Saturday, November 23, 2024
Homeట్రేడింగ్CREDAI Property show 2nd phase launched: ప్రారంభమైన రెండవ క్రెడాయ్ ప్రాపర్టీ షో

CREDAI Property show 2nd phase launched: ప్రారంభమైన రెండవ క్రెడాయ్ ప్రాపర్టీ షో

ఆగస్టు 9-11 వ వరకు కొంపల్లిలో..

దేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌ల అత్యున్నత సంస్థ, క్రెడాయ్.. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా హైటెక్స్‌లో క్రెడాయాబిలిటీ-నేపథ్యంతో నిర్వహించిన ప్రాపర్టీ షో అపూర్వ విజయం అందించిన ఉత్సాహంతో తమ రెండవ క్రెడాయాబిలిటీ షోను నిర్వహిస్తుంది. ఆగస్టు 9, 2024 నుంచి ఆగస్టు 11, 2024 వరకు కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ క్రెడాయాబిలిటీ షో జరుగుతోంది. ఈ ప్రాపర్టీ షోలో బాలానగర్, కొంపల్లి, శామీర్‌పేట్, మేడ్చల్, అల్వాల్, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, విల్లాలు, ప్లాట్లు, కమర్షియల్ స్పేస్‌లతో కూడిన అత్యుత్తమ ప్రాజెక్ట్‌లు ఒకే చోట ప్రదర్శిస్తున్నారు.

- Advertisement -

క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. “ 2019 వ సంవత్సరం మొదటి అర్ధభాగం ( హెచ్1-సీవై19) నుండి 2024 వ సంవత్సరం మొదటి అర్ధభాగం ( హెచ్1 సీవై24) తో పోల్చినప్పుడు యూనిట్ అమ్మకాల మొత్తం విలువలో 29% వార్షిక వృద్ధి (సీఏజీఆర్)తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిశ్రమ బలంగా, వేగంగా విస్తరిస్తోంది. హెచ్1-సీవై24 వర్సెస్ హెచ్1-సీవై19 చూసినప్పుడు విక్రయించబడిన యూనిట్ల విలువపరంగా నగరం 257% పెరుగుదలను నమోదు చేసింది. అలాగే హెచ్1 – సీవై24 వర్సెస్ హెచ్1-సీవై 19 చూసినప్పుడు 38.643 యూనిట్లతో హౌసింగ్ యూనిట్ అమ్మకాలలో 148% వృద్ధి కనిపించింది . సీఆర్ఈ మ్యాట్రిక్స్‌తో కలిసి క్రెడాయ్ హైదరాబాద్ చేసిన అధ్యయనం ద్వారా రూపొందించిన హైదరాబాద్ హౌసింగ్ రిపోర్ట్‌లో వెల్లడి చేసిన ఈ సంఖ్యలు ‘బ్రాండ్‌ హైదరాబాద్’పై వేగవంతమైన కదలిక, సానుకూల సెంటిమెంట్‌ను హైలైట్ చేస్తాయి. ఎస్.ఆర్.డి.పి. కింద కొత్త రేడియల్ రోడ్ల నిర్మాణం, మెట్రో,ఎం.ఎం.టి.ఎస్. నెట్‌వర్క్ లను విస్తరించటం, చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి వేగవంతమైన రవాణా కారిడార్‌ల కోసం ప్రణాళికలు వంటి ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్ వేగంగా ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందుతోంది. మూసి రివర్‌ఫ్రంట్ కార్యక్రమం ఒక శక్తివంతమైన వినోద స్థలాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది, అయితే డిజిటల్ టెక్నాలజీలో అభివృద్ధి నగరం యొక్క ఆధునీకరణను మరింత ముందుకు తీసుకువెళుతుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం, నగరంలో వారసత్వ సంపదను కాపాడుతూ, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తూ నగరంలో అభివృద్ధి, పెట్టుబడులను వేగవంతం చేసేందుకు వేగంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తోంది” అని అన్నారు.

వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ..“చురుకైన ప్రభుత్వ విధానాలు నగరం అంతటా సమగ్ర వృద్ధిని సాధించేలా చేశాయి, ఒక ప్రాంతంలో రద్దీని నివారించడంతోపాటు ఇతర భాగాలు వెనుకబడి ఉండకుండా చేస్తున్నాయి. ఇ-కామర్స్ గిడ్డంగులు, మెడికల్ డివైజెస్ పార్క్ మరియు ‘జీనోమ్ వ్యాలీ’కి ఉత్తర హైదరాబాద్ నిలయంగా ఉండి – లైఫ్ సైన్సెస్, మెడికల్ రీసెర్చ్‌లకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. విస్తారమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని హైలైట్ చేయడానికి, మేము ఆగస్టు 9 నుండి 11, 2024 వరకు నార్త్ హైదరాబాద్‌లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నాము. అపూర్వమైన స్పందనను ఆశిస్తున్నాము” అని అన్నారు.

క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ – ఎలెక్ట్ ఎన్. జైదీప్ రెడ్డి మాట్లాడుతూ, “ఒక నగరం యొక్క రియల్ ఎస్టేట్ వృద్ధి పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చురుకైన నాయకత్వంలో, సుస్థిర వృద్ధి ప్రోత్సహింస్తున్నారని, భవిష్యత్ సవాళ్లు పరిష్కరిస్తున్నారన్నారు. ఎలివేటెడ్ కారిడార్‌ల కోసం రక్షణ భూములను సేకరించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు నగరం యొక్క ఉత్తర భాగ అభివృద్ధికి గణనీయంగా తోడ్పడనున్నాయని, రియల్ ఎస్టేట్ వృద్ధిని పెంచుతాయన్నారు. హైదరాబాద్ ప్రపంచ వ్యాపార కేంద్రంగా ఉంది, ఎం.ఎన్.సి.ను ఆకర్షిస్తోందని, శక్తివంతమైన స్థానిక వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందన్నారు. ఆగస్టు 11వ తేదీ వరకు సాగనున్న క్రెడాయబిలిటీ ప్రాపర్టీ షోలో ఆధునిక కొనుగోలుదారుల అంచనాలకు అనుగుణంగా ఇప్పుడు ప్రీమియం హౌసింగ్ స్మార్ట్ హోమ్ టెక్నాలజీలు, పర్యావరణ అనుకూల ఫీచర్‌లను ఎలా పొందుపరిచిందో చూపిస్తుంది” అని అన్నారు.

క్రెడాయ్ హైదరాబాద్ సెక్రటరీ బి. జగన్నాథరావు మాట్లాడుతూ..“నగరం అంతటా సమగ్ర వృద్ధిని నిర్ధారించడానికి, పారిశ్రామిక కారిడార్లు హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (సి.యు.ఆర్.) అంతటా విస్తరించి ఉన్నాయి. నార్త్ కారిడార్ దీని వల్ల లాభపడింది. ఈ ప్రాంతాన్ని పశ్చిమ హైదరాబాద్ స్థాయికి తీసుకువెళ్లేందుకు , కండ్లకోయలో 100 కంపెనీలకు ఆతిథ్యం ఇవ్వగల, 50,000 మందికి ఉపాధి కల్పించగల అత్యంత ఎత్తైన ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నారు. నోవార్టిస్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ వంటి ప్రపంచ దిగ్గజాలతో సహా 200 కంపెనీలు, 15,000 మంది ఉద్యోగులతో ఈ ప్రాంతం బయో-మెడికల్ ఆర్ & డికి కూడా కేంద్రంగా ఉంది. హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ (హెచ్‌ఎన్‌ఐసి) వృద్ధిని మరింత వేగవంతం చేస్తుంది, ఇది గృహాలకు డిమాండ్‌ను పెంచుతుంది ” అని అన్నారు.

“ఉత్తర హైదరాబాద్‌లో హెచ్1 సీవై19తో పోలిస్తే హెచ్1 సీవై24లో విక్రయించబడిన యూనిట్లలో 179% పెరుగుదల కనిపించింది, మొత్తం అమ్మకాల విలువ పరంగా 23% సి.ఎ.జి.ఆర్ ఉంది. రూ. 1-2 కోట్ల మధ్య ధర ఉన్న ప్రాపర్టీలు 264% పెరిగాయి, రూ. 1 కోట్ల లోపు ఉన్న ప్రాపర్టీ లు 128% పెరిగాయి. ఆకర్షణీయంగా 2 కోట్లు – 5 కోట్లు నడుమ ధరలు కలిగిన విభాగంలో కూడా 157% అమ్మకాలు పెరిగాయి. హెచ్1 సీవై24లో సగటు యూనిట్ విలువ హెచ్1 సీవై19 నుండి 35% పెరిగి రూ. 1 కోటికి చేరింది. ఈ పోకడలు ఉత్తర హైదరాబాద్‌లో డిమాండ్ మరియు ఆస్తి విలువలలో గణనీయమైన పెరుగుదలను చూపుతున్నాయి. మరింత ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, గృహ కొనుగోలుదారులు 9 ఆగస్టు 2024 నుండి 11వ తేదీ వరకు కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్‌లో #క్రెడాయబిలిటీ ప్రాపర్టీ షోను అన్వేషించ వలసిందిగా సూచించడమైనది. ధరలు పెరగక ముందే తమ కలల ఇంటిని భద్రపరచుకునే సమయం ఆసన్నమైంది” అని అన్నారు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా ప్రధాన ఆకర్షణలు..

సి.ఆర్.ఇ. మ్యాట్రిక్స్‌తో కలిసి క్రెడాయ్ హైదరాబాద్ చేసిన హైదరాబాద్ హౌసింగ్ రిపోర్ట్: జూలై 2024:

• హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ హెచ్1-సీవై19 నుండి హెచ్1-సీవై24 వరకు యూనిట్ అమ్మకాల మొత్తం విలువలో 29% గణనీయమైన వార్షిక వృద్ధి రేటు (సి.ఎ.జి.ఆర్.)ని చూసింది.
• హెచ్1 – సీవై24 కోసం హైదరాబాద్‌లో విక్రయించబడిన గృహాల మొత్తం విలువ రూ.58,841 కోట్లు – అత్యధిక వార్షిక అమ్మకాల విలువ ఇది.
• నగరంలో హెచ్1-సీవై24కి విక్రయించబడిన ఫ్లాట్ సగటు విలువ రూ. 1.5 కోట్లు. హెచ్1-సీవై19తో పోలిస్తే 44% పెరిగింది, అయితే ఉత్తర హైదరాబాద్‌లో విక్రయించిన ఫ్లాట్ సగటు విలువ రూ. 1 కోటి.
• హైదరాబాద్‌లో రూ. 7000/చ.అ. కంటే తక్కువ ధరల విభాగంలో ఉన్న ఆస్తులు గరిష్ట విక్రయాలు జరుపుకుంటున్నాయి. అయితే, ఇతర మెట్రోలతో పోలిస్తే కస్టమర్లు పెద్ద ఫ్లాట్‌లను ఇష్టపడుతున్నారు.
• రూ. 5 – 10 కోట్లు విలువ సెగ్మెంట్లో హైదరాబాద్ 449% వృద్ధిని నమోదు చేసింది. హెచ్1 సీవై24లో దీని విలువ రూ. 7,427 కోట్లు .
• రూ. 10 కోట్లు పైన సెగ్మెంట్లో 63X వృద్ధిని హైదరాబాద్ నమోదు చేసుకుంది. హెచ్1-సీవై24లో దీని విలువ రూ.4,861 కోట్లు
• బడ్జెట్ విభాగం రూ. 1 కోటి లోపు హెచ్1సీవై24 వర్సెస్ హెచ్1సీవై19చూస్తే 103% పెరిగింది.
• హైదరాబాద్ హెచ్1-సీవై24లో విక్రయించబడని యూనిట్లలో సుమారు 1,05,000 యూనిట్లకు క్షీణతను నమోదు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News