కరీంనగర్ లో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా సాగింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థగా ఎదిగిన సీఎంఆర్ గ్రూప్ తమ 32వ షాపింగ్ మాల్ ను కరీంనగర్ నగరంలోని మార్కెట్ రోడ్ లో లాంచ్ చేసింది. ద జాయ్ ఆఫ్ లైఫ్ అని చెప్పే సీఎంఆర్ ట్యాగ్ లైన్ లానే కరీంనగర్ ప్రజలకు నిజంగానే సరికొత్త షాపింగ్ అనుభూతిని కల్పించే దిశగా ఈ మాల్ ప్రారంభం కావటం స్థానికులకు ఆనందం కలిగిస్తోంది.
డాక్టర్ భూంరెడ్డి చేతుల మీదుగా..
డా. భూంరెడ్డి ఈ మాల్ ను తన ప్రారంభించటం విశేషం. చలిమెడ లక్ష్మీ నరసింహారావు, డా. వి. సూర్యనారాయణ రెడ్డి, రమాదేవి ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవ్వగా చిదుర సురేష్ కరీంనగర్ బ్రాంచ్ సీఎంఆర్ కు తొలి వినియోగదారుడిగా వస్త్రాలు కొనుగోలు చేశారు.
నాలుగు దశాబ్దాల వస్త్ర ప్రపంచం..
గత 40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణల్లో ప్రజలు తమ వస్త్రశ్రేణిని వినియోగదారులు ఆస్వాదిస్తూ, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని సి.ఎం.ఆర్ ఫౌండర్-ఛైర్మన్ మావూరి వెంకటరమణ అన్నారు. సీఎంఆర్ అంటే ప్రపంచస్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందన్నారు మావూరి. అన్ని వయసుల వారు అన్ని వేడుకలకు తమకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలను కొనేందుకు తమ షాపింగ్ మాల్ సరైన వేదిక అని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే వస్త్రాలు అందించటం తమ ప్రత్యేకత అంటూ మావూరి వివరించారు. సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్లో ఇంకెవ్వరూ ఇవ్వనంత సరసమైన ధరలకే తాము అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఇది 32వ బ్రాంచ్..
సీ.ఎం.ఆర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ.. తన 32వ షోరూమును కరీంనగర్ లో ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎంఆర్ అంటేనే ద వన్ స్టాప్ షాప్ అనేలా ఇంటిల్లపాదికి నచ్చేలా అన్ని వెరైటీలు, డిజైన్లు లభిస్తాయన్నారు. అందుబాటు ధరల్లో లక్షల్లో డిజైన్లు, వేలల్లో వెరైటీలు లభిస్తాయన్నారు.
పాయల్, సంయుక్తల అభిమానం..
సినీ నటులు పాయల్ రాజ్ పుత్, సంయుక్త మీనన్ జ్యోతి ప్రజ్వలన చేసి, షాపింగ్ మాల్ లోని అన్ని సెక్షన్లు కలియదిరిగారు. నాలుగు దశాబ్దాలుగా కంప్లీట్ షాపింగ్ మాల్ గా ఎదిగిన సంస్థను పాయల్, సంయుక్త తమ మాటల్లో గొప్పగా అభివర్ణించారు. ఇక తమ ఫ్యాన్స్ ను ఆటపాటలతో వీరు ఉర్రూతలూగించారు.