Saturday, November 23, 2024
Homeటెక్ ప్లస్Google: మనోళ్లకు షాక్ ఇచ్చిన గూగుల్

Google: మనోళ్లకు షాక్ ఇచ్చిన గూగుల్

గూగుల్ లో ఉద్యోగులను సాగనంపే ప్రక్రియ ఇంకా జోరుగా కొనసాగుతోంది. తాజాగా ఇండియాలో 453 మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు గూగుల్ ప్రకటించి, భారతీయులకు షాక్ ఇచ్చింది. ఈమేరకు గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా మెయిల్ ను ఉద్యోగులకు పంపారు. కాస్ట్ కటింగ్, ప్రపంచ మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నీ సాగుతున్నాయి. టెక్ జెయింట్ గూగుల్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను విపరీతంగా తగ్గించుకుంది. గత నెల్లోనే గూగూల్ 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తుండగా ఆయన తన జీత భత్యాలను కూడా తగ్గించుకున్నారు. మరోవైపు అమెరికాలో ఇప్పటికే గూగుల్ లో ఉద్యోగాలు ఊడినవారంతా పెద్ద ఉద్యమానికి దిగారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News