నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుగా నిలుస్తున్న మంచిర్యాల వాసవి క్లబ్స్ జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ పర్యటనలో భాగంగా మంచిర్యాల వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్, విజయం టీచర్స్ క్లబ్, విజయం వేంపల్లి ఈ క్లబ్, బి జోన్ ఈ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు నిరుపేదలకు రెండు నెలలకు సరిపడా నిత్యవసర సలుకుల పంపిణీ, నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం, ఏకలవ్యాశ్రమంలో బియ్యం, విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం, రెడ్ క్రాస్ సొసైటీలో వృద్ధులకు చేతి కర్రలు చెప్పుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి మాట్లాడుతూ, వాసవి క్లబ్ డిస్టిక్ వి 107 ఏ పరిధిలో దాదాపు 50 క్లబ్బులు అనేక రకాల సేవా కార్యక్రమాలను ప్రతినిత్యం నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం మంచిర్యాల ప్రాంతంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, వాసవి మాత పారాయణాలు, చలివేంద్రం లాంటి అనేక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానాలు, నిరుపేదలకు వైద్య పరీక్షల నిమిత్తం రవాణా ఖర్చులకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. మిగతా కాలంలో కూడా మంచి సేవా కార్యక్రమాలు నిరుపేదలకు అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్యాబినెట్ సెక్రెటరీ జంధ్యం మధుకర్, క్యాబినెట్ ట్రెజరర్ కేశెట్టి వంశీకృష్ణ, రీజియన్ చైర్ పర్సన్ కాసం సతీష్, రీజియన్ సెక్రెటరీ గౌరీశెట్టి ధనలక్ష్మి, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అక్కనపెల్లి రవీందర్, పుల్లూరి బాలు మోహన్, జిల్లా అధికారులు ఉత్తూరి రమేష్, నాగిశెట్టి జ్యోతి, దొంతుల లావణ్య, జోన్ చైర్ పర్సన్ లు నలమాసు ప్రవీణ్, అయిత శ్రీనివాస్, దైద సరిత, తాటిపల్లి రమేష్ తోపాటు అన్ని క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు తదితరులు పాల్గొన్నారు.