రంగారెడ్డి జిల్లాలో అవినీతి అధికారులు పట్టుబడ్డారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డారు. ధరణిలో మార్పులు చేసేందుకు రూ. 8 లక్షలు డిమాండ్ చేసి దొరికిపోయారు. ఇద్దరి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసిన ఏసిబి, ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల భూమిని తొలగించాలని కోరిన బాధితుడు. ఈ పని చేసేందుకు ఎనిమిది లక్షలు డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి. బాధితుడు కారులో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పిన సీనియర్ అసిస్టెంట్. ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్కు ఫోన్ చేసిన సీనియర్ అసిస్టెంట్. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని ఫోన్లో మాట్లాడిన జాయింట్ కలెక్టర్. పెద్దంబర్పేట్ వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ.