స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమ ఖాతాదారులు తక్షణం రుణ విముక్తి పొందేందుకు అనువుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ సంఝౌతా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ప్రతి ఎన్.పి.ఎ. బారోయర్ తన రుణాలను పరిష్కరించుకోవడానికి ఆహ్వానం పలుకుతోంది బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఎన్.పి.ఎ. ఖాతాదారులందరికీ ఆకర్షణీయమైన తగ్గింపులతో వన్ టైం సెటిల్మెంట్ పేరుతో సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. సంఝౌతా దినోత్సవం పేరుతో ఈ ప్రత్యేక స్కీమును బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. రుణగ్రహీతలు వ్యాపార లేదా వైద్య పరిస్థితితో ఇబ్బంది లేదా ఇతరత్రా కారణాలతో రుణాన్ని సకాలలో చెల్లించలేని ఎన్.పి.ఎ. రుణగ్రహీతల కోసం ప్రత్యేకంగా ఈ ఆఫర్ ను ప్రకటించింది.
ఈ పథకాన్ని అందిపుచ్చుకోవాలనుకునే కస్టమర్లు ఆగష్టు 16, 17 తేదీలలో సెటిల్మెంట్ రోజున లేదా అంతకు ముందే మీ బ్రాంచ్ ను సందర్శించాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఒకేసారి మీ ఎన్.పి.ఎ. ఖాతాను మూసివేయటంతో రుణ విముక్తిని వెంటనే పొందవచ్చని సంస్థ వివరిస్తోంది.