Sunday, October 6, 2024
HomeతెలంగాణYadadri: మాజీ ఎమ్మెల్యే వేముల ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుక

Yadadri: మాజీ ఎమ్మెల్యే వేముల ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుక

కేసీఆర్ జన్మదిన వేడుకలను రామన్నపేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ ఆలయంలో పార్టీ నేతలంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సుభాష్ సెంటర్ లో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ కెసిఆర్ కారణజన్ముడని ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ వీరుడు కేసీఆర్ అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News