CPI Narayana : బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయవంతంగా ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆరో సీజన్ ప్రసారం అవుతోంది. ఇంకొన్ని రోజుల్లో ఈ సీజన్ కూడా పూర్తి కానుంది. ప్రముఖ సీని హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవరిస్తున్న ఈ షో ను రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు.
ఈ షో ఒక సాంఘిక దురాచారం వంటిదని నారాయణ విమర్శించారు. బిగ్‌బాస్ షోను రద్దు చేయాలని తెలంగాణలో తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ ను స్వీకరించలేదని చెప్పారు. అయితే.. తన విన్నపానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించిందని చెప్పారు. ఇందుకు ఏపీ హైకోర్టుకు ధన్యవాదాలు తెలియజేశారు. బిగ్‌బాస్‌పై దాఖలు అయిన పలుపిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారించిందని గుర్తు చేశారు.
కాగా.. బిగ్‌బాస్‌ను ఆది నుంచి నారాయణ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. టాస్క్‌ల పేరుతో ఈ షోలో అశ్లీలకరమైన కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.