Friday, September 20, 2024
HomeతెలంగాణBansuvada: ప్రభుత్వాసుపత్రికి జాతీయ గుర్తింపు

Bansuvada: ప్రభుత్వాసుపత్రికి జాతీయ గుర్తింపు

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్) జాతీయ గుర్తింపు దక్కింది. తల్లి పాలను ప్రోత్సహించే “బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (BFHI)” అందించే “బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడేషన్ (గ్రేడ్ -1)” లభించింది. తద్వారా భారత దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ప్రభుత్వ దవాఖానగా బాన్సువాడ ఎంసీహెచ్ రికార్డ్ సాధించింది. శిశువుల ఆరోగ్యం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 10 ప్రమాణాలను నిర్దేశించింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మదర్స్ అబ్జల్యూట్ అఫెక్షన్ (MAA) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఈ ప్రమాణాలకు అనుగుణంగా బ్రెస్ట్ ఫీడింగ్ ను ప్రోత్సహిస్తున్న దవాఖానలను యూనిసెఫ్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా (BPNI), అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ ఇండియా (AHPI) సంయుక్తంగా ఎంపిక చేసి BFHI అక్రిడేషన్ ఇస్తున్నాయి. ఈ సర్టిఫికెట్ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News