బస్సులలో ప్రయాణించే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలనీ, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారిక మీద దృష్టి పెట్టి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పథకాలను మహిళల కోసం ప్రవేశపెడితే కేటీఆర్ మాత్రం ఇలా మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానించటాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ, మహిళల ఆర్థిక స్థితిని పెంచి దేశంలో తెలంగాణ మహిళలను అత్యంత శక్తివంతంగా మార్చాలన్న రేవంత్ రెడ్డి ఆలోచనకు మహిళలంతా ఆనందంగా ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ తీరు ఉండటం సిగ్గుచేటన్నారు.