ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి 353 ఆరాధన సప్త రత్రోత్సవలు ఉత్సవాలు 18 తేదీ ఘనంగా ప్రారంభయ్యాయి. ఈ సందర్భం మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు మఠం ముఖద్వారం దగ్గర ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
- Advertisement -
కాషాయం జెండాను ఎగురవేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సప్త రత్రోత్సవల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను దీప ప్రజ్వలనతో ప్రారంభించారు. ఉంజల సేవా మండపంలో శకోత్సవం, ఉంజల్ సేవా పూజ క్రతువులను నిర్వహించారు.
లక్ష్మీ పూజ, గో, ఆశ్వ పూజలు నిర్వహించారు. యోగింద్ర వేదికపై కళాకారులు నృత్య ప్రదర్శన, సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మఠం వీధులు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి.