తుంగభద్రా తీరాన వెలసిన ఆధ్యాత్మిక క్షేత్రంలో రాఘవేంద్ర స్వామి 353 ఆరాధన సప్త రత్రోత్సవలు ఉత్సవాలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. రెండోరోజు మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో స్వామి మూల బృందావనానికి విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
మూల రాముల పూజ, ప్రహ్లాద రాయల పాదపూజ, ఉరేగింపు, అలంకరణా, మంగళ హారతి పూజ క్రతువులు నిర్వహించారు. సప్త రత్రోత్సవల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలో బాగంగా భరత నాట్యం, సంగీత కార్యక్రమాలు కనుల పండువగా సాగాయి. ఉంజల సేవా మండపం లో శాకోత్సవం, ఉంజల్ సేవా పూజ క్రతువులను నిర్వహించారు. ఉత్సవ రాయలను చెక్క, వెండి , బంగారు, నవరత్నాల రథలపై ఊరేగించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మఠం వీధులు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి.