Saturday, November 23, 2024
HomeNewsSeethakka participated in BRAC summit: అంతర్జాతీయ సంస్థ బ్రాక్ తో మంత్రి సీతక్క

Seethakka participated in BRAC summit: అంతర్జాతీయ సంస్థ బ్రాక్ తో మంత్రి సీతక్క

అంతర్జాతీయ సంస్థ బ్రాక్ (BRAC) ప్రతినిధులతో సచివాలయంలో సమావేశమైన మంత్రి సీతక్క. పలు దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పని చేస్తున్న బ్రాక్. మారుమూల ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి రంగాల్లో పనిచేస్తున్న బ్రాక్. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన బ్రాక్.

- Advertisement -

తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులను, అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన బ్రాక్. వివరాలను మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన ప్రతినిధిలు. ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అనుకున్న స్థాయిలో అభివృద్ధి ఫలాలు పేదలకు చేరటం లేదని మంత్రి సీతక్క అన్నారు.

మారిన పరిస్థితులు అవసరాల నేపథ్యంలో పేదలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, నిరుపేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే మా ప్రభుత్వ లక్ష్యమని, పేదరికం నుంచి వచ్చిన నాకు పేదలతో పేగు బంధం ఉందన్నారు మంత్రి సీతక్క. సమాజంలో ఇంకా అసమానతలు ఉన్నాయని, నిరుపేదలకు అట్టడుగు, వర్గ ప్రజలకు కనీస వసతులు ఉండటం లేదన్నారు. బహు రూపాల్లో పేదరికం ఇంకా కొనసాగటం బాధాకరమని, పేదరికన్ని రూపుమాపే దిశలో అంతా కలిసి పని చేయాలన్నారు. అందరము అంకితభావంతో పని చేస్తే పేదరికం అనేది ఉండదని, పేదరిక నిర్మూలన కోసం మా ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు.

క్షేత్రస్థాయిలో పథకాలుఅమలవుతున్న తీరును మీ వంటి సంస్థలు అధ్యయనం చేయడం అభినందనీయమన్నారు సీతక్క. మాతో కలిసి పని చేసేందుకు మీరు ముందుకు రావడం సంతోషమని, పేదరిక నిర్మూలన కోసం మా ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పాలుపంచుకోండి, పేదలకు మెరుగైన విద్యా, వైద్యం, ఉపాధి కల్పన లో మా ప్రభుత్వానికి చేయూతనివ్వండని, బ్రాక్ అడ్వైజర్ శ్వేతా బెనర్జీతో పాటు పలువు ప్రతినిధులను సన్మానించిన మంత్రి సీతక్క.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News