Sunday, November 10, 2024
HomeNewsKarimnagar: తెలంగాణలో మావోయిస్టులు లేరు

Karimnagar: తెలంగాణలో మావోయిస్టులు లేరు

తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజలు క్షేమమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ ముందుకు సాగుతుందని రాష్ట్ర డిజిపి జితేందర్ అన్నారు. కరీంనగర్ కమిషనరేట్ కు రాష్ట్ర డీజీపీ డా. జితేందర్ వచ్చారు. కరీంనగర్, సిరిసిల్ల , జగిత్యాల పోలీస్ అధికారులతో డిజిపి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డిజిపీ మాట్లాడుతూ ప్రజల క్షేమమే పోలీస్ లక్ష్యమంటూ ముందుకు సాగుతున్నామన్నారు .

- Advertisement -

ట్రాఫిక్ నియంత్రణకై తగు చర్యలు తీసుకుంటూనే అక్రమ ఇసుక రవాణా, సైబర్ నేరాలు, డ్రగ్స్ కంట్రోల్ గంజాయి అక్రమ రవాణా, సరఫరాపై డేగ కన్నేసినట్లు తెలిపారు. అక్రమ భూకబ్జా దందా అరికట్టడంలో అన్నీ రాష్ట్రాల్లో కంటే ముందున్నామన్నారు. ట్రాఫిక్ పెరిగిపోతున్నందున నియంత్రించేందుకుగాను అనేక చర్యలు చేపడుతున్నామన్నారు . రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ , నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను పట్టుకోవడంపై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ప్రతీ వాహనదారు ట్రాఫిక్ రూల్స్ ని ఖచ్చితంగా పాటించేలా అనేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇతర ప్రాంతాల నుండి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు వస్తున్నా సమాచారం మేరకు పోలీస్ వ్యవస్థ అలర్ట్ అయిందన్నారు.

త్వరలో సిబ్బంది కొరత ను పూర్తిగా అధిగమిస్తామని అన్నారు. కొందరు ట్రైనింగ్ లో ఉన్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు డ్రగ్స్ సరఫరాపై ఆరా తీస్తున్నామన్నారు . ఎక్కడి నుండి వస్తుంది?.. ఎవరి ధ్వారా వస్తుంది ఆరా తీస్తున్నామన్నారు. వారి కదలికలపై కన్నేసి పెట్టాం. ఎవరిని వదిలి పెట్టేది లేదన్నారు. ఈ మధ్య కాలంలో అక్కడక్కడా గంజాయి గుట్టుగా సరఫరా అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అయితే ప్రత్యేక నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి సరఫరా చేసే వారి కదలికలు ఆరా తీస్తున్నాం.

తెలంగాణలో గంజాయి ఉత్పత్తి లేదు. ఇతర ప్రాంతాల నుండి సరఫరా అవుతుందన్నారు. అక్రమ భూ కబ్జా దారులపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ రేంజ్ ఐజీ చంద్ర శేఖర్, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, పోలీస్ అధికారి శేషాద్రినీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News