Saturday, November 23, 2024
HomeNewsManakonduru: ఊటూర్ సొసైటీపై కంప్లైంట్

Manakonduru: ఊటూర్ సొసైటీపై కంప్లైంట్

రుణ మాఫీతో వెలుగులోకి..

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ (లక్ష్మిపూర్) సొసైటీ అధికారులపై ఓ రైతు మానకొండూర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రైతుకు తెలియకుండానే సొసైటీ అధికారులు రైతు పేరున పంట రుణం తీసుకున్నారని, రైతు రుణమాఫీతో వ్యవహారం బయటకు వచ్చిందని రైతు లబోదిబోమంటున్నాడు.

- Advertisement -

రైతు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాల మేరకు… లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎడ్ల మల్లయ్య అనే రైతు ఊటూర్ సొసైటీలో 2016లో రూ.90 వేలు పంట రుణం తీసుకున్నాడు. ప్రతి సంవత్సరం రూ.90 వేలకు వడ్డీ చెల్లించుకుంటూ రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఐతే ఆగస్ట్ 2023లో మల్లయ్యకు తెలియకుండానే అతని పేరున రూ.1,50,000 పంట రుణం తీసుకున్నారు. తిరిగి ఫిబ్రవరి 2024 లో బ్యాంకులో జమ చేశారు. రైతుకు తెలియకుండానే అతని పేరున రుణం తీసుకుని 8 నెలల పాటు వాడుకుని బ్యాంకులో జమ చేసారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిన రుణాల జాబితాలో మల్లయ్య పేరు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీకి డిసెంబర్ 2023 కటాఫ్ తేదీని నిర్ణయించడంతో మల్లయ్య సొసైటీలో తీసుకున్న రుణం మాఫీ కాలేదని లబోదిబోమంటున్నాడు. మల్లయ్యకు తెలియకుండానే అతని పేరున అక్రమంగా రుణం తీసుకోవడంతో రుణ మాఫీ కాలేదని, సొసైటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని మల్లయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.

కాగా ఊటూర్ సోసైటీలో మరికొంతమంది రైతులకు తెలియకుండానే వారి పేర్లపై రుణాలు తీసుకున్నట్లు తెలిసింది. పంట రుణాల మంజూరులో రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమంగా రుణాలు తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News