Saturday, November 23, 2024
Homeట్రేడింగ్CREDAI Vijayawada: విజయవాడలో ప్రారంభమైన క్రెడాయ్ - సౌత్‌కాన్ 2024

CREDAI Vijayawada: విజయవాడలో ప్రారంభమైన క్రెడాయ్ – సౌత్‌కాన్ 2024

భారతదేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌ల అత్యున్నత సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) విజయవాడలోని అయానా హోటల్, కన్వెన్షన్ సెంటర్‌లో సౌత్ కాన్ 2024ను నిర్వహించింది. క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్-అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, కేంద్ర భారీ పరిశ్రమలు-ఉక్కు శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, క్రెడాయ్ నేషనల్ లీడర్‌షిప్ టీమ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలలోని క్రెడాయ్ అన్ని చాప్టర్ లకు చెందిన నాయకులు, సభ్యులు సమక్షంలో ప్రారంభించారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలలో దక్షిణ భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో సహకారం, ఆవిష్కరణ, స్థిరమైన వృద్ధిని పెంపొందించడం సౌత్‌కాన్ 2024 లక్ష్యంగా పెట్టుకుంది.

పర్యావరణ అనుకూల నగరం అమరావతి..

క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బోమన్ ఇరానీ మాట్లాడుతూ , “భారతదేశం వైవిధ్యమైన దేశం , ప్రతి జోన్‌కూ , దాని ప్రత్యేక సవాళ్లు ఉన్నాయి. దక్షిణ భారత రాష్ట్రాలు వాణిజ్య, నివాస మరియు రిటైల్ రియల్ ఎస్టేట్ కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడి మెంబర్ డెవలపర్‌లు అద్భుతమైన రీతిలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు. ముందుచూపు కలిగిన నాయకుడు ఎన్. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధి మరియు పరివర్తన దిశగా కొనసాగుతున్నందున, ఈ సౌత్‌కాన్ ఎడిషన్‌ను విజయవాడలో నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. సౌత్‌కాన్ అనేది మా సభ్య డెవలపర్‌లు తాజా సాంకేతికతలు, స్థిరమైన నిర్మాణ పద్ధతులు, ప్రాజెక్ట్ నిర్వహణ ప్రక్రియల సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడంలో సహాయపడటమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ అమరావతిని పర్యావరణ అనుకూల నగరంగా అభివృద్ధి చేస్తున్నందున, సౌత్‌కాన్ 2024 ఈ పరివర్తనకు విలువైన పరిజ్ఞానం అందిస్తుంది. కలిసి, దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి మనమంతా ఈ అవకాశాలను ఉపయోగించుకోవచ్చు..” అని అన్నారు.

వికసిత్ భారత్ వైపు వెళ్తున్నప్పుడు..

జి రామ్ రెడ్డి, క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ మాట్లాడుతూ “ప్రాంతీయ మార్కెట్ల స్థిరత్వంను ప్రదర్శిస్తూ దక్షిణ భారత రియల్ ఎస్టేట్ రంగానికి కీలక ఘట్టంను సౌత్‌కాన్ 2024 ఆవిష్కరిస్తుంది. దేశంలోని టెక్నాలజీ, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, స్టార్టప్ విప్లవంలో దక్షిణ భారత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి, ఈ రంగాలలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. మనం ‘వికసిత్ భారత్’ వైపు వెళుతున్నప్పుడు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడంపై దృష్టి కేంద్రీకరించాలి. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన నివాస ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతుంది. ఇది డెవలపర్‌లను ప్రీమియం నివాస స్థలాలపై దృష్టి సారించేలా చేస్తుంది, అయినప్పటికీ సరసమైన గృహాల అవసరం చాలా క్లిష్టమైనది. ” అని అన్నారు.

ఒకేచోట కీలకమైన సంస్థలు..

క్రెడాయ్ నేషనల్ జాయింట్ సెక్రటరీ బి. రాజా శ్రీనివాస్ మాట్లాడుతూ.. “దక్షిణ భారతదేశంలోని రియల్ ఎస్టేట్ పరిశ్రమకు ఒక ముఖ్యమైన మలుపును సౌత్‌కాన్ 2024 సూచిస్తుంది, స్థిరమైన అభివృద్ధి, ఆవిష్కరణలను పెంచడానికి కీలకమైన సంస్థలను ఒక చోట చేర్చింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణలలో నిరంతరం అభివృద్ధి చెందుతున్న వాతావరణాలను అన్వేషిస్తున్నప్పుడు, సాంకేతిక పురోగతిపై ఆధార పడటం, కొత్త మార్కెట్ విభాగాలను పరిశోధించడం చాలా అవసరం” అన్నారు.

వివిధ రాష్ట్రాల ప్రముఖులను ఏకం చేస్తూ..

ఈ సందర్భంగా క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధరన్ స్వామినాథన్ మాట్లాడుతూ, “క్రెడాయ్ సౌత్‌కాన్ 2024, వివిధ రాష్ట్రాలకు చెందిన పరిశ్రమల ప్రముఖులను ఏకం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఇది ముఖ్యమైన మార్కెట్ సవాళ్లు, అవకాశాలను పరిష్కరించే సమాచారంతో కూడిన ప్యానెల్‌లు, కీలక చర్చలలో పాల్గొనడానికి పరిశ్రమ నిపుణులకు డైనమిక్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. స్థిరమైన నిర్మాణ పద్ధతులు, సాంకేతిక ఆవిష్కరణలు వంటి ధోరణులపై దృష్టి సారించడంతో, సౌత్ కాన్ 2024 సృజనాత్మకతను ప్రేరేపించడానికి, వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం నెట్‌వర్కింగ్‌ను ప్రోత్సహించాలని ఆకాంక్షిస్తుంది” అన్నారు.

కీలకమైన క్షణాన్ని..

క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఆళ్ల శివా రెడ్డి మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌లోని రియల్ ఎస్టేట్ రంగానికి కీలకమైన క్షణాన్ని సౌత్‌కాన్ 2024 సూచిస్తుంది, భాగస్వామ్యాలు పెంపొందించుకోవటానికి , ఆవిష్కరణ, స్థిరత్వాన్ని పెంపొందించడానికి డెవలపర్‌లను ఒకచోట చేర్చింది. మన ఆశయాలను ప్రత్యక్ష ఫలితాలలోకి ప్రోత్సహించడానికి, మరింత ఆశాజనకమైన భవిష్యత్తును సృష్టించేందుకు సమిష్టిగా కృషి చేయడానికి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి” అని అన్నారు.

అమరావతిని గ్రీన్ సిటీగా..

క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వై.వి. రమణరావు మాట్లాడుతూ , “ఈ సంచలనాత్మక కార్యక్రమానికి దక్షిణ భారతదేశంలోని పరిశ్రమల ప్రముఖులు, డెవలపర్‌లు, ఆవిష్కర్తలను ఏకం చేయడం సంతోషంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని ఉన్నతీకరించడం, స్థిరమైన భవిష్యత్తును ప్రోత్సహించడం ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సు పరస్పర చర్చలు, ఆలోచనలను పంచుకోవడం, విలువైన పరిజ్ఞానం పొందడం కోసం అసాధారణమైన అవకాశాలను అందిస్తుంది. అమరావతిని గ్రీన్ సిటీగా మార్చడంతోపాటు, సహకారం, స్థానిక కార్యక్రమాలపై దృష్టి సారించి, దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ ల్యాండ్‌స్కేప్‌ను పురోగమింపజేయడానికి ఈ సదస్సు చాలా ముఖ్యమైనది” అన్నారు.

చర్చల కోసం సదస్సుకు..

సౌత్‌కాన్ కన్వీనర్ డి. రాంబాబు మాట్లాడుతూ, “ఈ ప్రాంతంరియల్ ఎస్టేట్ భవిష్యత్తును రూపొందించే, పరిశ్రమను ముందుకు నడిపించడానికి తోడ్పడే ధోరణులు, సవాళ్లపై చర్చల కోసం ప్రతి ఒక్కరూ ఈ సదస్సుకు హాజరుకావటంతో పాటుగా మాతో చేరాలని అభ్యర్థిస్తున్నాము” అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News