యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా టి.జి.ఎస్.ఆర్.టి.సి. ఉద్యోగి బంధువులకు కోటి రూపాయల బీమా మొత్తం అందజేశారు.
టి.జి.ఎస్.ఆర్.టి.సి. తమ ఉద్యోగులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ అకౌంట్ కలిగి ఉన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు శాఖలతో “యూనియన్ సూపర్ శాలరీ ఖాతా” కలిగి ఉన్న టి.జి.ఎస్.ఆర్.టి.సి. ఉద్యోగులకు కోటి రూపాయల (ప్రమాదం కారణంగా మరణం) వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని అందిస్తోంది. పి.ఎ.ఐ. కవర్‌తో పాటు, ప్లాటినం/రూపే సెలెక్ట్, యూనియన్ సూపర్ శాలరీ అకౌంట్ వేరియంట్ ఆధారంగా డెబిట్ కార్డ్‌పై రూ.15 లక్షల వరకు అదనపు కవర్ అందిస్తోంది.
టి.జి.ఎస్.ఆర్.టి.సి., వరంగల్ డిపో పరిధిలో విద్యుదాఘాతంతో మరణించిన అతని ఒక ఉద్యోగి కుటుంబ సభ్యునికి కోటి రూపాయల బీమా మొత్తాన్ని అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిప్యూటీ జోనల్ హెడ్ సమక్షంలో రవాణా-బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వీసీ సజ్జనార్, చేతుల మీదుగా కుటుంబ సభ్యునికి చెక్కులు అందజేశారు. ఎం అరుణ్ కుమార్, రీజినల్ హెడ్ సత్యం పలుగుల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, సి.ఎఫ్.ఓ., టి.జి.ఎస్.ఆర్.టి.సి. నుండి ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.