Thursday, September 19, 2024
HomeదైవంYadadri Turkapalli: ఘనంగా శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు

Yadadri Turkapalli: ఘనంగా శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు

తుర్కపల్లి మండలం ములకలపల్లి పంచాయతీ పరిధిలో గల విశ్వభారత్ గ్లోబల్ స్కూల్లో, ఇబ్రహీంపూర్ గ్రామంలోని అంగనివాడి సెటర్ 2లో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలతో అందరిని అలరించారు. అనంతరం శ్రీకృష్ణ, రాధా వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విశ్వభారత్ గ్లోబల్ పాఠశాల డైరెక్టర్ ప్రతిమ, ప్రిన్సిపల్ ఆలేటి భాస్కర్, అంగనివాడి టీచర్ మంజుల, ఉపాధ్యాయులు సంతోషి ,రాధా, శైలజ ,లావణ్య, కల్పన, శిరీష, రాజేశ్వరి ,జాకియా,ఆయా చెంద్రకల, విద్యార్థినీ విద్యార్థులు తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News