Friday, September 20, 2024
HomeఆటKurnool: ఘనంగా యుటిఎఫ్ క్రీడా సంబరాలు

Kurnool: ఘనంగా యుటిఎఫ్ క్రీడా సంబరాలు

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాస్థాయి క్రీడా సంబరాలను ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని స్థానిక అవుట్ డోర్ స్టేడియంలో షటిల్ పోటీలు, సెయింట్ జోసెఫ్ కళాశాల మైదానంలో క్రికెట్ పోటీలతోపాటు, షార్ట్ పుట్, క్యారమ్స్, చెస్ తదితర పోటీలను జిల్లా అధ్యక్షుడు రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు.

- Advertisement -

ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి ఆగస్టు నాటికి 50 సంవత్సరాలు పూర్తయిందని ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లకు అక్టోబర్ 4,5,6 తేదీలలో గుంటూరులో రాష్ట్రస్థాయి క్రీడా సంబరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారన్నారు.

క్రికెట్ మ్యాచ్ కర్నూలు, ఎమ్మిగనూరు డివిజన్ జట్ల మధ్య పోటీ జరుగగా ఎమ్మిగనూరు జట్టు గెలుపొందిందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి నవీన్ పార్టీ, జిల్లా సహాధ్యక్షులు హేమంత్, యెహోషువ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News