తనకు పోరాటం కొత్త కాదని తిహార్ జైలు నుంచి విడుదలైన కేసీఆర్ కుమార్తె కవిత అన్నారు. 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసానన్న కవిత..బీఆరెస్ పార్టీకి, కేసిఆర్ కి, తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -
టిఆర్ఎస్ పార్టీకి, మన కుటుంబానికి ఇబ్బందులు సృష్టించిన వాళ్లకు కచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తామని కవిత ఆవేశంగా మాట్లాడారు. ఇటువంటి కష్ట సమయంలో మా కుటుంబానికి వెన్నంట ఉన్న ప్రతి ఒక్కరికి పాదయాభివందనాన్ని తెలియజేస్తున్నానని కవిత పేర్కొన్నారు.