Friday, November 22, 2024
HomeఆటICC T20I Rankings : అంద‌నంత ఎత్తులో టీమ్ఇండియా ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్‌

ICC T20I Rankings : అంద‌నంత ఎత్తులో టీమ్ఇండియా ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్‌

ICC T20I Rankings : టీమ్ఇండియా 360 డిగ్రీస్ ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్ ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో త‌న అగ్ర‌స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకున్నాడు. ఇటీవ‌ల ముగిసిన ప్ర‌పంచ‌క‌ప్ లో 239 ప‌రుగులు చేసిన సూర్య‌, కివీస్‌తో టీ20 సిరీస్‌లోనూ 124 ప‌రుగులతో రాణించాడు. దీంతో ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన టీ20 ర్యాకింగ్స్‌లో 890 కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించాడు. తొలి స్థానంలో సూర్య ఉండ‌గా 836 పాయింట్ల‌తో రెండో స్థానంలో పాకిస్తాన్ ఓపెన‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ఉన్నాడు. వీరిద్ద‌రి మ‌ధ్య అంత‌రం 54 రేటింగ్ పాయింట్లు.

- Advertisement -

భార‌త్‌తో సిరీస్‌లో ఆక‌ట్టుకున్న డేవన్‌కాన్వే ఒక స్థానం ఎగ‌బాకి 788 పాయింట్ల‌తో మూడో స్థానంలో కొన‌సాగుండ‌గా, 778 పాయింట్ల‌తో బాబ‌ర్ ఆజం నాలుగో స్థానంలో ఉన్నాడు. భార‌త ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ రెండు స్థానాలు దిగ‌జారి 13వ స్థానంలో కొన‌సాగుతున్నాడు.

ఇక టీ20 బౌలింగ్ విభాగంలో ఒక్క భార‌త బౌల‌ర్ కూడా టాప్‌-10లో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. సీనియ‌ర్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ 11 స్థానంలో నిలువ‌గా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించిన అర్ష‌దీప్ సింగ్ ఒక స్థానం ఎగ‌బాకి 21వ స్థానం, చాహ‌ల్ 40వ స్థానంలో కొన‌సాగుతున్నారు. 704 పాయింట్ల‌తో లంక స్పిన్న‌ర్ హస‌రంగా అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకోగా అఫ్గాన్ స్పిన‌ర్ ర‌షీద్ ఖాన్‌, ఇంగ్లాండ్ స్పిన్న‌ర్ ఆదిల్ ర‌షీద్ లు వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News