Saturday, November 23, 2024
HomeతెలంగాణAfter 20 years school re-opened: 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బడి

After 20 years school re-opened: 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బడి

తుపాకులగూడెం స్కూల్ పునః ప్రారంభం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటి డి ఏ పి. ఓ చిత్ర మిశ్రాలతో కలిసి ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తుపాకులగూడెం లోని గిరిజన ప్రాథమిక పాఠశాల 2001-2002 వరకు నడిచిందని, అప్పుడు పని చేసిన ఉపాధ్యాయులు బదిలీల్లో వెళ్ళిపోతే అప్పటి నుంచి స్కూల్ క్లోజ్ చేయబడినదని తెలిపారు. ఇక్కడి పిల్లలు పక్కనే ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతునందున గ్రామస్తులు మా గ్రామంలో పాఠశాల కావాలని కోరారని అందుకే పక్కనే ఉన్న TWPS స్కూల్ నుండి ఇద్దరు ఉపాధ్యాయులను నియమించి పాఠశాల కొనసాగిస్తున్నమని మంత్రి తెలిపారు. పాఠశాల భవనం నకు పెయింటింగ్ వేయించాలని, కిటికీలకు మెష్ ఏర్పాటు చేయించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు.

అయితే 20 ఏళ్లుగా మూతపడిన బడి, మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క చొరవతో మళ్లీ తెరుచు కోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అక్షరం అందుబాటులోకి తెచ్చి తమ పిల్లల కష్టాలు తీర్చిన మంత్రి సీతక్కకు ధన్య వాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ కె. సత్య పాల్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి, తహసిల్దార్, ఎం. ఈ. ఓ., తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News