చండీగఢ్: హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో గో మాంసం తిన్నాడనే అనుమానంతో ఒక యువకుడిని గోసంరక్షకుల బృందం కొట్టి చంపింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 27న సాబీర్ మాలిక్ హత్యకు గురయ్యాడు. గో మాంసం తింటున్నాడనే అనుమానంతో ఐదుగురు నిందితులు మాలిక్‌ను ఒక దుకాణానికి పిలిచారు. అక్కడ అతనిని తీవ్రంగా కొట్టారు. నిందితులను అభిషేక్, మోహిత్, రవీందర్, కమల్జీత్, సాహిల్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితులు అతనిని కొడుతుండగా, స్థానికులు కొందరు అడ్డుకున్నారు. దీంతోవారు సబీర్ మాలిక్‌ను మరో చోటికి తీసుకెళ్లి చావబాదారు. దీంతో అతను మృతిచెందాడు. సాబీర్ మాలిక్ మాలిక్ చర్కీ దాద్రీ జిల్లాలోని బాంద్రా గ్రామ సమీపంలోని మురికివాడలో నివసించేవాడని పోలీసులు తెలిపారు. జీవనోపాధి కోసం స్క్రాప్ ఏరుకునేవాడని తెలిపారు. ఈ ఉదంతంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ జస్టిస్ కోడ్‌లోని నిబంధనల ప్రకారం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.
Chandigarh: గో మాంసం తిన్నాడనే అనుమానంతో యువకుని హత్య
సంబంధిత వార్తలు | RELATED ARTICLES