Saturday, April 5, 2025
HomeతెలంగాణJadcharla heavy rains-MLA Anirudh visits: తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి

Jadcharla heavy rains-MLA Anirudh visits: తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జడ్చర్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మున్సిపాలిటీ పరిధిలో జలమయమైన వివిధ వార్డులోని లోతట్టు ప్రాంతాలను ఆదివారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు వార్డుల్లో పర్యటించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయం చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమీషనర్ రాజయ్యకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజయ్య, తాహసిల్దార్ సత్యనారాయణ రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News