ములుగు నియోజకవర్గంలో జోరు వానలోనూ కొనసాగుతోంది మంత్రి సీతక్క పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాలను, గోదావరి పరివాహక గ్రామలను సందర్శించిన మంత్రి సీతక్క, మారుమూల, చిట్టచివరి గ్రామాలను సందర్శించి ప్రజలకు సీతక్క భరోసా ఇచ్చారు.
ఈదురు గాలులతో ఇండ్లు ధ్వంసమైన కొండపర్తి గ్రామాన్ని విజిట్ చేసిన మంత్రి, అండగా ఉంటామని భాధితులకు మంత్రి భరోసా ఇచ్చారు. ఇండ్ల మరమ్మత్తుల కోసం ఆర్దిక చేయుత నిస్తామని వెల్లడించారు. త్వరలో ఇందిరమ్మ ఇండ్లూ మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. ప్రమాదవశాత్తు మరణించిన పశువుల కాపారి విశ్వనాథ్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు మంత్రి.
ముందు జాగ్రత్త చర్యల వల్ల పెను ప్రమాదాన్ని నివారించగలిగామంటూ సీతక్క తెలిపారు. మండలాల వారిగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ మానిటరింగ్ కమిటీలు సత్ఫలితాలిచ్చాయని సీతక్క తెలిపారు. ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కొవడానికి ముందస్తు ప్రణాళికలు సిద్దం చేసామని సీతక్క అన్నారు.
ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎస్ ఐ, తో పాటు మరో ఇద్దరు అధికారులతో కమిటీలు వేసామంటూ మంత్రి సీతక్క వివరించారు. ప్రజలను, పై అధికారులను అప్రమత్తం చేయంలో, సహయ కార్యక్రమాలను ముమ్మరం చేయడంలో ఫ్లడ్ మానిటరింగ్ కమిటీలు బాగా పనిచేసాయని, అందుకే ఈ దఫా ప్రమాధాలను నివారించగలిగామని సీతక్క అన్నారు.
వరద ముప్పు పోయే వరకు ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలని, రాజకీయాలకు అతీతంగా మానవ దృక్పథంతో నేతలు వ్యవహరించాలంటూ సీతక్క పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించాలని, వరద బీభత్స ప్రాంతంలో ప్రజల రక్షణకు యువత, స్థానిక నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలన్నారు మంత్రి సీతక్క. ప్రాణ నష్టం జరగ కుండా నివారంచడమే మన లక్ష్యం కావాలన్నారు సీతక్క.