Shikhar Dhawan : న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న టీమ్ఇండియా వన్డే సమరానికి సిద్దమైంది. మరో రెండు రోజుల్లో కివీస్‌తో భారత్ తొలి వన్డేలో తలపడనుంది. ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో శిఖర్ ధావన్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇటీవల ఐపీఎల్‌లో పంజాబ్ ప్రాంఛైజీకి సైతం ధావన్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. తాజాగా వీటిపై ధావన్ స్పందించాడు.
కెప్టెన్‌గా ఎన్ని ఎక్కువ మ్యాచులు ఆడితే అంత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ధావన్ అన్నాడు. ఇంతకముందు బౌలర్‌కు ఇబ్బందిగా ఉన్నప్పటికీ అదనంగా ఓవర్ వేయించేవాడిని అయితే ఇప్పుడు జట్టు అవసరాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడంలో పరిణితి సాధించినట్లు చెప్పుకొచ్చాడు. నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందాలంటే జట్టును బ్యాలెన్స్ చేసుకుంటూ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. ఎవరైనా ఆటగాడు ఒత్తడికి గురైతే అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేసి సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత కెప్టెన్‌పైనే ఉంటుందని చెప్పాడు.
ఇక ఐపీఎల్‌లో ఆడడం చాలా మందికి కల. ట్రోఫిని గెలవడం కష్టమైందేదీ కాదు. అయితే.. అదే సమయంలో కెప్టెన్సీ పోతుందన్న ఆందోళన కూడా ఏమీ లేదు అని ధావన్ అన్నాడు.