గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల వలన ఎస్సారెస్పీ నిండుకుండలా మారింది. ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో గోదావరి నదికి ప్రవాహం పెరిగింది. మల్లాపూర్ మండలంలోని వాల్కొండ గ్రామం వద్ద గోదావరి నది ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతుందని ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని గోదావరి నది వైపు ఎవరు వెళ్ళద్దని, పశువుల మేత మేత గారు అటువైపు వెళ్ళకూడదు అని ,అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, పంచాయతీ సిబ్బంది గోదావరి నది వద్ద పహారగా ఉండాలని, నది ప్రవాహన్ని గంట గంటకు పంచాయతీ కార్యదర్శులు తెలియజేయాలని అన్నారు.
ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ వరదల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి తీరం వైపు ఎవరు వెళ్లకూడదని, పోలీసు సిబ్బంది అలర్ట్ గా ఉండాలని తెలిపారు. గోదావరి నదిని పరిశీలించిన వారిలో ఆర్డీవో శ్రీనివాస్,డీఎస్పీ ఉమా మహేశ్వర్, ఎమ్మార్వో వీర్ సింగ్, ఎస్సై కిరణ్ కుమార్ , రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.