వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం ఈ సమావేశం ప్రారంభమైంది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు వైయస్.జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
- Advertisement -
పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపైన కూడా వైయస్.జగన్ చర్చించనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైయస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, తద్వారా రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోయడం తదితర అంశాలన్నీకూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. నిన్ననే పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులతో వైయస్.జగన్ సమావేశమై వివిధ అంశాలపై వారితో చర్చించారు, వారికి దిశానిర్దేశం చేశారు.