ఏపీలో 108 వాహనాల (108 Vehicles) సిబ్బంది ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత త్వరగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. లేదంటే ఈ నెల 25 నుంచి సేవలు నిలిపి వేస్తామని 108 ఒప్పంద ఉద్యోగుల సంఘం ప్రకటించింది.
108 వాహనాల (108 Vehicles) ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. తాము పడుతున్న సమస్యల పై ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించామని ఆయన వెల్లడించారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యలకు పరిష్కారం దొరకలేదని, త్వరలో సమస్యలు పరిష్కరించకుంటే బంద్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర 108 సంఘ నేతలు మహేష్, మునిరాజ, రాజేష్, సునీల్, కేశవులు, సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.