Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్14 days remand to Chandrababu: రేపు హైకోర్టులో అప్పీల్ చేయనున్న బాబు

14 days remand to Chandrababu: రేపు హైకోర్టులో అప్పీల్ చేయనున్న బాబు

22వ తేదీవరకు జ్యుడీషియల్ కస్టడీలో

చంద్రబాబు నాయుడుని 14 రోజుల పాటు రిమాండ్‌ లో ఉండనున్నారు.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభంకోణం కేసులో ఏపీ ఏసీబీ కోర్టు చంద్రబాబును 22వ తేదీవరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ కుంభంకోణం కేసులో శనివారం తెల్లవారు జామున నంద్యాలలో సీఐడీ అధికారులు చంద్రబాబును అదుపులోకి తీసుకుని, రాత్రి సిట్‌ కార్యాలయంలో విచారించింది. ఆదివారం చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు. చంద్రబాబు తరుఫున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా బృందం వాదనలు వినిపించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News